Tuesday, August 12, 2025
E-PAPER
spot_img
Homeఖమ్మంరక్తదానంతో వ్యక్తిగత ప్రయోజనం.. సామాజిక హితం: డాక్టర్ విజయ్ కుమార్

రక్తదానంతో వ్యక్తిగత ప్రయోజనం.. సామాజిక హితం: డాక్టర్ విజయ్ కుమార్

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట
రక్తదానంతో వ్యక్తిగత ఆరోగ్య ప్రయోజనం తో బాటు సామాజిక హితం ఉంటుందని స్థానికి ఏరియా ఆస్పత్రి ప్రధాన వైద్యులు డాక్టర్ విజయ్ కుమార్ అన్నారు.  ఏరియా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన రక్త నిల్వ కేంద్రానికి బాసటగా స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పర్యవేక్షణలో ఈ నెల 14 ఆస్పత్రి ప్రాంగణంలో రక్తదాన శిభిరం‌ నిర్వహించనున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఆయన రక్తదానంతో సామాజిక, వ్యక్తిగత ప్రయోజనాలను నవతెలంగాణకు వివరించారు.

రక్తదానం చేయడం వలన హృద్రోగ సంబంధ వ్యాధులకు దూరంగా ఉండొచ్చని,నూతన రక్తకణాలు అభివృద్ది చెందుతాయని,క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయని,లివర్ (కార్జం ) ఆరోగ్యంగా ఉంటుందని,ఇనుము (ఐరన్) ధాతువు మితిమీర కుండా ఉంటుందని,వ్యాధి నిరోధక శక్తి పెరగడంతో పాటు శారీరక అంతర్గత వత్తిడి తగ్గుతుందని అన్నారు.

రక్తదానం చేయడంతో సామాజికంగా ప్రమాదంలో ఉన్న,ప్రాణాపాయం లో ఉన్న మరొకరికి పునర్జీవం ఇచ్చాం అనే సంతృప్తి ఉంటుందని తెలిపారు. స్త్రీలు అయితే 14 గ్రాములు మించి ఉన్నవారు, పురుషులు అయితే 12 గ్రాములు మించి, 60 కేజీలు పైబడిన బరువు ఉన్న ఎవరైనా సంవత్సరానికి ఒక సారి లేదా రెండు సార్లు రక్తదానం చేయవచ్చు అని తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img