నవతెలంగాణ – అశ్వారావుపేట
సాటి మనిషిని ప్రాణాపాయంలో కాపాడేది రక్తదానం మే నని అందుకే అన్ని దానాలు కన్నా కన్నా రక్తదానం మే మిన్న అని స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అన్నారు. అశ్వారావుపేట ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన రక్త నిల్వ కేంద్రానికి రక్తం సేకరణ కోసం ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ప్రత్యేక చొరవతో గురువారం ఆసుపత్రి ప్రాంగణంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసారు.
ఈ శిబిరంలో స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన యువకులు మహిళలు ప్రజా ప్రతినిధులు రక్తం దానం చేసి రక్తదానం మహాదానం అని నిరూపించారు. ఈ కార్యక్రమం ద్వారా సేకరించిన రక్తాన్ని ఆసుపత్రి రక్తం నిల్వ కేంద్రంలో భద్రపరిచి అత్యవసర సమయాల్లో ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు, ప్రసవ సమయంలో అవసరం ఉన్న గర్భిణీ లకు ఉచితంగా అందించనున్నట్టు ఆయన తెలిపారు.
రక్తదానం ప్రాణ దానం అని ఒక్క బాటిల్ రక్తం ముగ్గురికి ప్రాణం నిలుపుతుంది అని,ప్రతి ఆరోగ్య వంతుడు సంవత్సరానికి కనీసం ఒకసారి రక్తదానం చేస్తే ఎవరూ రక్తం కోసం ఇబ్బందులు ఉండవని అన్నారు.ఇలాంటి సేవా కార్యక్రమాలలో ముందుకు రావాలని అశ్వారావుపేట నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు.ఈ క్రమంలోనే ఆసుపత్రిలో నూతన డిజిటల్ ఎక్స్ రే యూనిట్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ డాక్టర్ రవి బాబు,ఆసుపత్రి సూపరింటెండెంట్ రాధా రుక్మిణి,ఆర్ఎంఓ డాక్టర్ విజయ్ కుమార్ లు పాల్గొన్నారు.