Sunday, January 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రక్తదాతలు దేవుళ్ళతో సమానం 

రక్తదాతలు దేవుళ్ళతో సమానం 

- Advertisement -

– రెడ్ క్రాస్ చైర్మన్  రాజన్న
నవతెలంగాణ – కామారెడ్డి 

రక్తదాతలు దేవుళ్ళతో సమానమని, ప్రతి ఒక్కరూ రక్తదాతల స్ఫూర్తితో ముందుకు వచ్చి రక్తదానం చేసి ప్రాణాలను నిలపాలనీ రెడ్ క్రాస్ చైర్మన్ రాజన్న అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రక్తదాతలు దేవుళ్ళతో సమానమని, ప్రతి ఒక్కరూ రక్తదాతల స్ఫూర్తితో ముందుకు వచ్చి రక్తదానం చేసి ప్రాణాలను నిలపాలని అన్నారు. శనివారం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో బ్లడ్ బ్యాంకులో రక్త నిల్వలు పడిపోవడంతో కామారెడ్డి రెడ్ క్రాస్ సహకారంతో కామారెడ్డి బ్లడ్ డోనర్స్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగిందన్నారు. 

రక్తదాతలు  ఆపద సమయంలో వారి రక్తాన్ని దానం చేస్తూ సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా  నిరంతరం ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడుతున్నారు అన్నారు. కామారెడ్డి జిల్లా రక్తదాతలు  ఆపద కాలంలో  చేదోడు వాదొడుగా ఉంటూ రక్తదానం చేస్తూ ముందుకెళ్తున్నారన్నారు. రక్తదాతలు మంచి మనసున్న  మహారాజులనీ, రక్తదానానికి ముందుకు వచ్చిన కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ ఎన్ సీ సి విద్యార్థులు, సాందీపని డిగ్రీ కళాశాల విద్యార్థులతో పాటు  పలువురు రక్తదాతలకు మెమంటూ అందజేసి సత్కరించారు.

ఈ కార్యక్రమం నిర్వహించడానికి ముందుకు వచ్చిన బ్లడ్ డోనర్స్ జిల్లా అధ్యక్షుడు కిరణ్, జనరల్ సెక్రటరీ మోసార్ల శ్రీకాంత్ రెడ్డి, శ్రీధర్ లను రెడ్ క్రాస్ చైర్మన్ రాజన్న అభినందించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన చింతల  లక్ష్మిపతి తో పాటు, రెడ్ క్రాస్ చైర్మన్  రాజన్న, వైస్ చైర్మన్ నాగరాజ్ గౌడ్, హ్యూమన్ రైట్స్ రాష్ట్ర సలహాదారు కేతు రమణారెడ్డి, కిరణ్,  మోసార్ల శ్రీకాంత్ రెడ్డి, శ్రీధర్లతో పాటు టెక్నీషియన్ ప్రమోద్, న్యాయవాది ఈక శ్రీనివాస్ రావు, సంధీపని కళాశాలల ఉపాధ్యాయులను, ఎన్ సీ సి ప్రభుత్వ, సాందీపని విద్యార్థులను మెమొంటోలు అందజేసి  సన్మానించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -