– గాజాపై ఆగని ఇజ్రాయిల్ విధ్వంసం..
– తాజాగా 135 మంది మృతి
రఫా: ఇజ్రాయిల్- హమాస్‌ల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో టెల్ అవీవ్ గాజాపై భీకర దాడులను కొనసాగిస్తోంది. శనివారం అర్థరాత్రి నిరాశ్రయులకు ఆశ్రయం కల్పిస్తున్న పలు నివాసాలు, శిబిరాలపై వైమానిక దాడులు జరపడంతో ఖాన్‌యూనిస్‌లో 29 మంది, ఉత్తర గాజాలో 48 మంది, జబాలియాలోని శరణార్థి శిబిరంలో 26మందితో పాటు మొత్తం 103 మంది మరణించారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన 9మంది ప్రాణాలు కోల్పోగా.. ఏడుగురు చిన్నారులు చనిపోయినట్టు అధికారులు పేర్కొన్నారు. పదుల సంఖ్యలో క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. తాజా దాడులపై ఇజ్రాయిల్ సైన్యం ఎటువంటి ప్రకటనా చేయలేదు. కాగా శనివారం ఒక్కరోజే 150 మంది ప్రాణాలు కోల్పోయారని, 450 మందికి గాయాలయ్యాయని గాజా ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. ఆదివారం జరిపిన దాడుల్లో 135 మంది చనిపోయారని అధికారులు తెలిపారు.మార్చి 18న కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనకు గురైనప్పటి నుంచి 3 వేల మందికిపైగా పాలస్తీనియన్లు మరణించారని వెల్లడించింది.
దాడుల నేపథ్యంలో ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇటీవల కీలక ప్రకటన చేశారు. కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగిం పునకు హమాస్ అంగీకరించని కారణం గానే దాడులను తీవ్రం చేసినట్టు తెలిపారు. ‘మా బందీలను విడుదల చేయడానికి హమాస్ పదేపదే నిరాకరిస్తోంది. అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్‌కాఫ్ ప్రతిపాదించిన కాల్పుల ఒప్పందం కొనసాగింపును తిరస్కరించింది. ఈనేపథ్యంలోనే దాడులకు ఆదేశించాం.యుద్ధం లక్ష్యాలను సాధించ డానికి గాజాలోని హమాస్ స్థావరాలే లక్ష్యంగా ఐడీఎఫ్ దాడులు చేస్తోంది’ అని ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు.
రక్తచరిత్ర
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES