Tuesday, February 24, 2026
E-PAPER
Homeసినిమాసుజీత్‌ దర్శకత్వంలో 'బ్లడీ రోమియో'

సుజీత్‌ దర్శకత్వంలో ‘బ్లడీ రోమియో’

- Advertisement -

హీరో నాని తన 34వ చిత్ర టైటిల్‌ని అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి ‘బ్లడీ రోమియో’ అనే టైటిల్‌ పెట్టారు. యూనానిమస్‌ ప్రొడక్షన్స్‌, నిహారిక ఎంటర్టైన్మెంట్‌ బ్యానర్స్‌ పై వెంకట్‌ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఇటీవల ‘ఓజీ’తో భారీ విజయాన్ని అందుకున్న దర్శకుడు సుజీత్‌తో నానికి ఇది ఫస్ట్‌ కొలాబరేషన్‌. నాని పుట్టినరోజు సందర్భంగా మేకర్స్‌ అద్భుతమైన కామిక్‌-నోయిర్‌ టైటిల్‌ గ్లింప్స్‌ను విడుదల చేశారు.
ఈ సినిమా యాక్షన్‌తో పాటు స్టైలిష్‌ ఎస్తెటిక్‌ ఫ్లేర్‌కి ప్రాధాన్యం ఇస్తుందని ప్రజెంట్‌ చేస్తోంది. ప్రోమోలో హీరోను కిచెన్‌లో పరిచయం చేస్తారు. వెన్నెల కిషోర్‌ వాయిస్‌ ఓవర్‌ కొనసాగుతున్న కొద్దీ, అతని ‘రెసిపీలు’ నిజానికి అతని హింసాత్మక స్వభావానికి ప్రతీకలని రివీల్‌ అవుతుంది. ‘చిటికెడు కరుణ’, ‘పిడికెడు కోపం’ లాంటి పదార్థాలను వంటకంగా చూపిస్తూ, తన జీవితాన్ని ఓ మాస్టర్‌ చెఫ్‌లా ప్రజెంట్‌ చేశారు. సాధారణంగా కనిపించే ప్రెషర్‌ కుక్కర్‌ ఒక్కసారిగా టైమ్‌ బాంబ్‌లా పేలిపోవడం ద్వారా గ్యాంగ్‌స్టర్స్‌ డెన్‌ను ధ్వంసం చేయడం ఈ కాన్సెప్ట్‌కి క్లైమాక్స్‌గా నిలిచింది. నాని పాత్ర ఒక ఫైటర్‌గా కాకుండా, దేనికి లెక్క చేయని పవర్‌లా బయటి రావడం అదిరిపోయింది.
ఈ వేసవిలో షూటింగ్‌ ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి రచన, దర్శకత్వం: సుజీత్‌, నిర్మాత: వెంకట్‌ బోయనపల్లి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -