నవతెలంగాణ – జన్నారం: ఏ ఎన్నికలైనా సరే వాటి నిర్వహణలో బిఎల్వో లదే కీలక పాత్ర అని మాస్టర్ ట్రైనర్ జగన్ జన్నారం తహశీల్దార్ రాజమనోహర్ రెడ్డి తెలిపారు. శనివారం మండలకేంద్రంలోని రైతువేదికలో ఖానాపూర్ నియోజకవర్గ జన్నారం మండల బిఎల్ఓ లకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాజ్యాంగంలో పొందుపర్చిన నిబంధనల ప్రకారం బీఎల్వోలు నడుచుకోవాలన్నారు.
బిఎల్వోలు నిర్వహించే కర్తవ్యాల పైనే ఎలక్షన్లు ఆధారపడి ఉంటాయన్నారు. ఎన్నికల అధికారులు ఇచ్చిన పనులను చూచా తప్పకుండా పాటించాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ రామ్మోహన్రావు, ఆర్ ఐ జాడి గంగ రాజా, టెక్నికల్ అధికారి రఘు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన బిఎల్వోలు, అంగన్వాడీలు పాల్గొన్నారు.
ఎన్నికల నిర్వహణలో బిఎల్ఓలదే కీలకపాత్ర..
- Advertisement -
- Advertisement -