Friday, July 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఓటర్ జాబితా సవరణలలో బిఎల్వోలు జాగ్రత్తలు తీసుకోవాలి..

ఓటర్ జాబితా సవరణలలో బిఎల్వోలు జాగ్రత్తలు తీసుకోవాలి..

- Advertisement -

ఆర్డీవో కృష్ణారెడ్డి…
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
: ఓటరు జాబితా సవరణలో బీఎల్ ఓలు జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్డీవో కృష్ణారెడ్డి అన్నారు. ఓటరు జాబితా సవరణపై  భువనగిరిలో బీఎల్ ఓ లకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. క్షేత్రస్థాయి పరిశీలన అనంతరమే నూతన ఓటరు నమోదు, సవరణ, తొలగింపు, బదిలీ, ఫొటో మార్పిడి తదితర సవరణలను చేపట్టాలని సూచించారు.

స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నందున బల్కుగా వచ్చే ఫారాలు, ఒకే వ్యక్తి పెద్ద మొత్తంలో ఇచ్చే ఫారాలపట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. నిస్పక్షపాతంగా, బాధ్యతాయుతంగా, పారదర్శకంగా విధులు నిర్వహించాలని అన్నారు. ఈమేరకు ప్రజలకు అవగాహన కల్పించా లని, అర్హులందరూ ఓటరు జాబితాలో చేరేలా చైతన్యపరచాలని అన్నారు. తహ సీల్దార్ అంజిరెడ్డి, రిసోర్స్ పర్సన్స్ నర్సిరెడ్డి, నరేందర్రెడ్డి, చిత్తరంజన్, బిక్షం, సంజీవరెడ్డి , ప్రణయ్ కుమార్, రజనీష్ ప్రసాద్ , బాలరామ్ అవగాహన కల్పించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -