Friday, January 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బిఎల్ టీయూ క్యాలెండర్ ఆవిష్కరణ

బిఎల్ టీయూ క్యాలెండర్ ఆవిష్కరణ

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం (బిఎల్టీయు) రాష్ట్ర కమిటి ఆధ్వర్యంలో ముద్రించిన 2026 ఆంగ్ల సంవత్సర క్యాలెండర్ ను శుక్రవారం నిజామాద్ జిల్లా కేంద్రం లో అసిస్టెంట్ లేబర్ కమిషనర్ జి.శ్రావణీ చేతుల మీదుగా తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం (బిఎల్ టీయూ)2026 నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు ఎస్ ‌సిద్ది రాములు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రములోని బీడీ పరిశ్రమ లో పనిచేయు బీడీ కార్మికులు, ప్యాకర్లు, బట్టి, చటన్, నెలసరి ఉద్యోగులు, టేకేదార్ల ,సమస్యలపై నిరంతరం రాజీలేని పోరాటం చేస్తున్న తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం బిఎల్ టీయూ, రాష్ట్ర కమిటీ ఆద్వర్యంలో ప్రతి సంవత్సరం నూతన క్యాలెండర్‌ ను ముద్రించడం జరుగుతుంది అని తెలిపారు. ఈ కార్యక్రమం లో తెలంగాణ బహుజన జన బీడీ కార్మిక సంఘం బిఎల్ టీయూ రాష్ట్ర అధ్యక్షులు యస్. సిద్దిరాములి,రాష్ట్ర కోషదికారి యస్. డి. స్తెయ్యద్, బిఎల్ టీయూ నిజామాబాదు జిల్లా నాయకులు గంగా శంకర్, తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం నాయకులు,భూమన్న,భూలక్ష్మి,నర్సవ్వ,తదితరులు పాల్గొన్నారు‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -