Saturday, August 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నీలి నాలుక వ్యాధి నివారణ టీకాలు

నీలి నాలుక వ్యాధి నివారణ టీకాలు

- Advertisement -

నవతెలంగాణ – మాక్లూర్
మండలంలోని ముత్యంపల్లి, అమ్రాద్, ఒడ్యాట్ పల్లి గ్రామంలో పశు వైద్య, పశు సంపర్శక శాఖ ఆద్వర్యంలో గొర్రెలకు మేకలకు నీలి నాలుక వ్యాధి నివారణ టీకాలనుఅందాల పశు వైద్య అధికారి ఉమమ సహేర్ ఆద్వర్యంలో  శనివారం వేశారు. ఈ  కార్యక్రమానికి ఆకస్మికంగా జిల్లా పశు వైద్య, పశు సంవార్డక శాఖ వైద్యులు ఏం. రోహిత్ రెడ్డి తానికి చేసి టీకాలు చేశారు.  గొర్రెల పెంపకం దారులకు వ్యాధి నివారణ గురించి పలు సూచనలు చేశారు. నీలి నాలుక వ్యాధి ప్రధానంగా నోరు, ముక్కు స్రావాలు అధిక జ్వరం లాలాజలం కారడం, కంటి, ముక్కు నుంచి స్రావాలు,  కుంటితనం కూడా ఉంటుందన్నారు.

నాలుక నీలి రంగులోకి మారడం ద్వారా మేత మేయలేక జీవాలు నిరసించి పోతాయని తద్వారా విపరీత నష్టం జరుగుతుందన్నారు. అందుకే సకాలంలో టీకాలు వేయించాలని తెలిపారు. ఈ కార్యక్రమం జూలై 29 నుంచి ఆగస్టు 8వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు ఈ అవకాశాన్ని గొర్రెల మేకల పెంపకం దారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేవివో కళ్యాణి, విఏ మహమ్మద్ పాషా, ప్రమీల, గంగాధర్, సికిందర్, గొర్రెల, మేకల పెంపకం దారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -