Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంమిథున్‌ చక్రవర్తికి బీఎంసీ షోకాజ్‌ నోటీసు

మిథున్‌ చక్రవర్తికి బీఎంసీ షోకాజ్‌ నోటీసు

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్:
ప్రముఖ బాలీవుడ్‌ సినీనటుడు మిథున్‌ చక్రవర్తికి బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ) షోకాజ్‌ నోటీసులిచ్చింది. మలాడ్‌లోని ఆయన ఆస్తిలో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టారంటూ … ఈ నెల 10వ తేదీన బీఎంసీ అధికారులు ఈ నోటీసును పంపినట్లు తెలుస్తుంది. బీఎంసీ నోటీసు ప్రకారం … మిథున్‌ చక్రవర్తి తన ప్రాంగణంలో గ్రౌండ్‌ ఫ్లోర్‌తో పాటు మెజనైన్‌ ఫ్లోర్‌ను ఎలాంటి అనుమతి లేకుండా నిర్మించారు. మెజనైన్‌ ఫ్లోర్‌ అంటే రెండు అంతస్తుల మధ్య ఉండే అదనపు అంతస్తు. వీటితో పాటు, ఇటుకలతో కట్టిన గోడలు, చెక్క పలకలు, గాజు అద్దాలు, ఏసీ షీట్లతో 10X10 అడుగుల విస్తీర్ణంలో మూడు తాత్కాలిక నిర్మాణాలను కూడా అనుమతి లేకుండానే నిర్మించినట్లు బీఎంసీ గుర్తించింది. ఈ అక్రమ నిర్మాణాలను వెంటనే కూల్చివేయాలని బీఎంసీ మిథున్‌ చక్రవర్తిని ఆదేశించింది. అలా చేయని పక్షంలో ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ చట్టంలోని సెక్షన్‌ 475 ఎ ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఒకవేళ అనుమతి లేని నిర్మాణాలను తొలగించడంలో విఫలమైతే, ఈ సెక్షన్‌ కింద చర్యలు తీసుకునే అధికారం బీఎంసీకి ఉంటుంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad