నవతెలంగాణ-హైదరాబాద్: ఫిలిప్పీన్స్‌లో బోటు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 15మంది మరణించగా, 12మందికి పైగా గల్లంతైనట్లు కోస్ట్‌గార్డ్ తెలిపింది. వివరాల ప్రకారం.. దక్షిణ ఫిలిప్పీన్స్‌లో సోమవారం తెల్లవారుజామున 1.50 గంటలకు ప్రమాదం జరిగింది. ఎంవి త్రిషా కెర్స్టిన్ 3, జాంబోంగా నుండి బయలుదేరిన బోటు సులు ప్రావిన్స్‌లోని జోలోకి వెళ్తుండగా బోటు మునిగిపోయింది. జాంబోంగా ద్వీపకల్పంలోని బాసిలాన్ ప్రావిన్స్‌లో భాగమైన బలుక్-బలుక్ ద్వీపానికి తూర్పున ఐదు కిలోమీటర్ల దూరంలో బోటు ప్రమాదం జరిగింది. బోటు సామర్థ్యం 352 కాగా, 332మంది ప్రయాణికులు, 27 మంది సిబ్బంది ఉన్నారు. ఇప్పటివరకు సుమారు 316మందిని రక్షించారు. 15మంది మరణించినట్లు ధృవీకరించారు. 28మంది ఆచూకీ కోసం గాలిస్తున్నామని కోస్ట్‌గార్డ్ కమాండర్ రోమెల్ దువా తెలిపారు. కోస్ట్‌గార్డ్ విమానం, నావికాదళం, వైమానికాదళం సహాయక చర్యల్లో పాల్గొన్నాయని అన్నారు.



