– 24 మంది గల్లంతు
బహ్రెచ్: ఉత్తరప్రదేశ్ బహ్రైచ్‌లో ఘోర పడవ ప్రమాదం జరిగింది. కౌడియాల నదిలో ఓ పడవ బోల్తా పడి 24 మంది గల్లంతయ్యారు. ప్రమాద సమయంలో పడవలో 28 మంది ఉండగా, అందులో నలుగురిని సురక్షితంగా బయటపడ్డారు. మరోవైపు సమాచారం అందుకున్న జిల్లా అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్ల సాయంతో నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా విచారం వ్యక్తం చేశారు. తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.సురక్షితంగా ఈదుకుంటూ బయటకు వచ్చిన వారిని లక్ష్మీ నారాయణ్, రాణి దేవి, జ్యోతి, హరిమోహన్‌గా గుర్తించారు. గల్లంతైన వారిలో పిల్లలు, మహిళలు ఉన్నారని స్థానికులు చెప్పారు. అయితే రాత్రి సమయం కావడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతుందని అధికారులు చెబుతున్నారు. సహాయక చర్యలు జరుగుతున్నాయని, పడవలో ఉన్న ప్రయాణికుల సంఖ్య, తప్పిపోయిన వ్యక్తుల వివరాలను ఇప్పుడే చెప్పలేమని అధికారులు తెలిపారు.
యూపీలో పడవ బోల్తా
- Advertisement -
- Advertisement -



