10 మంది మృతి
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథుర జిల్లాలో ప్రమాదం
మథుర: ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథుర జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పర్యాటకులతో వెళ్తున్న పడవ బోల్తా పడటంతో 10 మంది మృతి చెందగా, పలువురు గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. బృందావన్‌లోని యమునా నదిలో శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. గల్లంతైన వారిని కాపాడేందుకు సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. కాగా, పడవలో 25 మంది ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే చనిపోయిన వారి మృతదేహాలను వెలికితీసినట్టు అధికారులు పేర్కొన్నారు. మరోవైపు, ఈ ఘటనపై ప్రధాని మోడీ, యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు ఎక్స్ వేదికగా తెలిపారు.
కేశీ ఘాట్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో మొదట ఆరుగురు మరణించినట్టు తెలిసింది. అయితే, సహాయక బృందాలు మరో నాలుగు మృతదేహాలను వెలికితీయడంతో చనిపోయిన వారి సంఖ్య 10కి చేరింది. పడవలో ఉన్నవారంతా పంజాబ్‌కు చెందిన వారిగా గుర్తించాం. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మధురలోని ఆర్మీ స్థావరం నుంచి సహాయం కావాలని మేం కోరాం. స్థానిక ఈతగాళ్లు ఇప్పటికే సహాయక చర్యల్లో పాల్గొన్నారు. గాయపడిన వారందరికీ సరైన చికిత్స అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సాధ్యమైనంత వరకు ఎక్కువ మంది ప్రాణాలను కాపాడటానికి అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. గల్లంతైన వారంతా క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నాం.” మథుర జిల్లా కలెక్టర్ చంద్ర ప్రకాశ్ సింగ్ తెలిపారు.
పర్యాటకులతో వెళ్తున్న పడవ బోల్తా
- Advertisement -
- Advertisement -



