- Advertisement -
న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో ప్రభుత్వ రంగంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా (బిఒబి) రూ.4,809 కోట్ల నికర లాభాలను ప్రకటించింది. గతేడాది ఇదే త్రైమాసికంలోని రూ.5,238 కోట్ల లాభాలతో పోల్చితే 8 శాతం తగ్గుదల చోటు చేసుకుంది. గడిచిన క్యూ2లో బ్యాంక్ మొత్తం ఆదాయం రూ.35,026 కోట్లకు తగ్గింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.35,445 కోట్ల ఆదాయం నమోదయ్యింది. 2025 సెప్టెంబర్ ముగింపు నాటికి బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తులు 2.16 శాతానికి పరిమితమయ్యాయి. 2024 ఇదే కాలం నాటికి 2.50 శాతం జిఎన్‌పిఎ చోటు చేసుకుంది. గడిచిన క్యూ2 ముగింపు నాటికి నికర ఎన్‌పిఎలు 0.60 శాతం నుంచి 0.57 శాతానికి దిగివచ్చాయి.
- Advertisement -



