ఆసీస్ క్రికెట్‌లో బాబ్‌ది చెరగని ముద్ర
మెల్‌బోర్న్ : ప్రపంచ క్రికెట్‌లో ఆస్ట్రేలియాను గొప్ప జట్టుగా తీర్చిదిద్దటంలో ముఖ్యభూమిక పోషించిన ఆ జట్టు మాజీ కెప్టెన్, దిగ్గజ క్రికెటర్ బాబ్ సిమ్సన్ (89) ఇక లేరు. 89 ఏండ్ల వయసులో బాబ్ సిమ్సన్ శనివారం సిడ్నీలో కన్నుమూశారు. 16 ఏండ్ల ప్రాయంలో న్యూ సౌత్ వేల్స్ తరఫున బరిలోకి దిగిన బాబ్.. 1957-1978లో ఆసీస్ తరఫున
62 టెస్టుల్లో 46.81 సగటుతో రాణించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో బాబ్ సిమ్సన్ 21029 పరుగులు, 349 వికెట్లు పడగొట్టాడు. తొలుత 1968లో వీడ్కోలు పలికిన బాబ్.. ఆసీస్ కష్టకాలంలో ఉండగా రిటైర్‌మెంట్‌ను వెనక్కి తీసుకుని భారత్‌తో సొంతగడ్డపై, వెస్టిండీస్‌పై కరీబియన్ దీవుల్లో ఐదేసి టెస్టుల్లో కంగారూ జట్టుకు కెప్టెన్సీ వహించాడు. అలెన్ బోర్డర్, బాబ్ సిమ్సన్‌లు ఆసీస్‌ను అగ్రశ్రేణి జట్టుగా నిలిపేందుకు బలమైన పునాది వేశారు. ఆస్ట్రేలియా క్రికెట్‌లో కోచ్‌గా, సెలక్షన్ కమిటీ సభ్యుడిగానూ బాబ్ సేవలందించారు. భారత క్రికెట్‌లోనూ రాజస్తాన్‌కు రంజీ ట్రోఫీలో కోచింగ్ సలహాదారుడిగా వ్యవహరించాడు. 1965లో విజ్డెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచిన బాబ్ సిమ్సన్.. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్, ఆస్ట్రేలియన్ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో నిలిచాడు.
బాబ్ సిమ్సన్ కన్నుమూత
- Advertisement -
- Advertisement -