Saturday, August 2, 2025
E-PAPER
Homeక్రైమ్గల్లంతైన ముగ్గురి మృతదేహాలు లభ్యం

గల్లంతైన ముగ్గురి మృతదేహాలు లభ్యం

- Advertisement -

నవతెలంగాణ- ఎర్రుపాలెం
ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం కట్లేరు నదిలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన ముగ్గురి మృతదేహాలు శుక్రవారం లభ్యమయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజర గ్రామానికి చెందిన భూక్య కోటేశ్వరరావు, బాదవత్‌ రాజు, భూక్య సాయిరాం.. గురువారం మీనవోలు గ్రామం వద్దనున్న కట్లేరు నదిలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు రాత్రంతా శ్రమించి ముగ్గురి మృతదేహాలను శుక్రవారం ఉదయం వెలికితీశాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, మధిర మార్కెట్‌ కమిటీ చైర్మెన్‌ బండారు నరసింహారావు, కాంగ్రెస్‌ పార్టీ మండలాధ్యక్షులు వేమిరెడ్డి సుధాకర్‌రెడ్డి, నాయకులు అనుమాలు వెంకటకృష్ణారావు, సాయికుమార్‌, రాజీవ్‌గాంధీ, బాబురావు తదితరులు మృతదేహాలను సందర్శించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -