Sunday, November 9, 2025
E-PAPER
Homeఆదిలాబాద్గోదావరిలో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం

గోదావరిలో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం

- Advertisement -

నవతెలంగాణ – జన్నారం
జన్నారం మండలం బాదంపల్లి శివారులోని గోదావరి నదిలో గల్లంతైన యువకుడు గుండా శ్రావణ్ మృతి చెందారు. శనివారం బాదంపల్లి గోదావరిలో స్నానం చేయడానికి వెళ్లి ఫోటో దిగుతూ ప్రమాదవశాత్తు కాలుజారి ఆయన వరద నీటిలో పడి కొట్టుకుపోయి గల్లంతయ్యారు. ఆదివారం ఉదయం బాదంపల్లి శివారులో ఆయన మృతదేహాన్ని స్థానికులు గుర్తించి బయటకు తీశారు. శ్రావణ్ మృతితో ఆయన కుటుంబంతో పాటు పట్టణంలో తీవ్ర విషాదం నెలకొంది. మృతుడి తండ్రి లచ్చన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై గొల్లపల్లి అనూష తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -