- Advertisement -
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రం శివారులోని పాటి హనుమాన్ ఆలయం సమీపంలోని వ్యవసాయ బావిలో గురువారం గుర్తు తెలియని మగ వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు కమ్మర్ పల్లి ఎస్ఐ అనిల్ రెడ్డి తెలిపారు. చనిపోయిన మగ వ్యక్తి వయస్సు సుమారు 35 నుండి 40 ఏండ్లు ఉంటాయన్నారు. ఎత్తు సుమారు 5.”6″, చామన చాయ రంగు. బ్రౌన్ కలర్ ప్యాంటు, బ్లూ కలర్ ఫుల్ షర్ట్, గ్రీన్ కలర్ బనియన్, ఆరెంజ్ కలర్ లో గల దేవుని తాడు మెడకు ధరించి ఉన్నట్లు తెలిపారు. మృతదేహం గురించి సమాచారం ఎవరికైనా తెలిస్తే కమ్మర్ పల్లి పోలీస్ స్టేషన్ లో గాని, 8712659868 ఫోన్ నెంబర్ లో గాని సంప్రదించాలని ఎస్ఐ జి.అనిల్ రెడ్డి కోరారు.
- Advertisement -