Saturday, August 9, 2025
E-PAPER
spot_img
Homeక్రైమ్గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం..

గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం..

- Advertisement -

ఆచూకీ తెలిసినవారు పోలీసులను సంప్రదించాలి: ఎస్హెచ్ఓ జి.సందీప్..
నవతెలంగాణ – డిచ్ పల్లి

ఇందల్ వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని చంద్రయాన్ పల్లి గ్రామ శివారులోని జాతీయ రహదారి 44 ప్రక్కన ఒక గుర్తుతెలియని మృతదేహం లభ్యమైనట్లు ఎస్ హెచ్  ఓ జి సందీప్ తెలిపారు. ఆయన తెలిపిన విరాళ ప్రకారం శనివారం ఉదయం చంద్రయాన్ పల్లి గ్రామ శివారులో  ఒక మృతదేహం ఉన్నట్లు సమాచారం అందడంతో ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించగా జాతీయ రహదారి పక్కన ఒక గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం ఉన్నట్లు కనుగొన్నామన్నారు. శవం కొద్దిగా కుళ్లిపోయి ఉందని ,శవం పై నేవీ బ్లూ కలర్ ప్యాంటు, వైట్ బనియన్, వైట్ అండ్ బ్రౌన్ చెక్స్ గల షర్టు, బ్రౌన్ కలర్ బెల్టు దానిపై డాలర్ గుర్తుగల బక్కెలు, ఎడమ కాలుకి నల్లటి దారం ఉందన్నారు. ఎవరైనా శవంను గుర్తుపడితే ఇందల్ వాయి పోలీస్ లకు సమాచారం ఇవ్వాలని కోరారు. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు డిచ్ పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ 8712659851, ఇందల్ వాయి ఎస్ హెచ్ ఓ  -8712659854 .

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img