Tuesday, February 3, 2026
E-PAPER
Homeక్రైమ్గుర్తుతెలియని వ్యక్తి మృతదేహ భాగాలు లభ్యం 

గుర్తుతెలియని వ్యక్తి మృతదేహ భాగాలు లభ్యం 

- Advertisement -

– సమాచారం ఇచ్చిన వారికి పారితోషకం ప్రకటించిన పోలీసులు
నవతెలంగాణ – కామారెడ్డి

కామారెడ్డి పట్టణంలోని అశోక్‌నగర్ కాలనీ, సిఎస్ఐ  చర్చ్ కాంపౌండ్, సిఎస్ఐ స్కూల్ సమీపంలో ఈ నెల 2న గుర్తుతెలియని ఒక పురుషునికి చెందిన మృతదేహ భాగాలు లభ్యమయ్యాయనీ కామారెడ్డి పట్టణ సీఐ నరహరి ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం సుమారు 08:00 గంటల సమయంలో సిఎస్ఐ చర్చ్ కాంపౌండ్ సమీపంలోని పాడుబడ్డ బావి వద్ద దుర్వాసన రావడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించగా, ఒక ప్లాస్టిక్ సంచిలో మానవ శరీర భాగాలు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు.

ప్రాథమిక అంచనాల ప్రకారం మృతుడు సుమారు 25 నుండి 35 సంవత్సరాల వయస్సు కలిగి ఉండవచ్చని, కొన్ని రోజుల క్రితం మృతి జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. మృతుడి పూర్తి గుర్తింపు ఇంకా తెలియరాలేదు. సంఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి  దర్యాప్తు చేస్తున్నామన్నామని పోలీసులు తెలిపారు. మృతుడు గ్రే రంగు డ్రాయర్ (DONAR అనే బ్రాండ్ గుర్తింపు) ధరించి ఉన్నాడన్నారు.

ఈ వివరాలకు సరిపోలే వ్యక్తి ఎవరైనా అదృశ్యమైనట్లయితే లేదా ఈ ఘటనకు సంబంధించిన సమాచారం ఎవరికైనా తెలిసి ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని తెలిపారు.

ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్, కామారెడ్డి టౌన్ సెల్ నంబర్: 8712686145 కు సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయన్నారు. ఉపయోగకరమైన సమాచారం అందించిన వారికి రూ.10,000 పారితోషికం అందిస్తామని ఆయన ప్రకటించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -