బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్ హీరోలుగా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘భైరవం’.
విజరు కనకమేడల దర్శకత్వంలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పెన్ స్టూడియోస్ అధినేత డా. జయంతిలాల్ గడా సమర్పిస్తున్నారు. హీరోయిన్స్‌గా అదితి శంకర్, ఆనంది, దివ్యా పిళ్ళై నటించారు. ఈ సినిమా ఈనెల 30న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ అదితి శంకర్ మీడియాతో ముచ్చటించింది.
నేను తమిళంలో చేసిన తొలి సినిమాని డైరెక్టర్ విజరు చూశారు. ఇందులో క్యారెక్టర్‌కు నేనైతే యాప్ట్‌గా ఉంటుందని భావించారు. ఆయన కాల్ చేసి ఈ ప్రాజెక్టు గురించి చెప్పారు. అలా ఈ ప్రాజెక్టులోకి వచ్చాను.
ఇందులో నా పాత్ర బోల్డ్ అండ్ హానెస్ట్, అదే సమయంలో బబ్లీగా ఉండే క్యారెక్టర్‌లో కనిపిస్తాను. ఇది నా ఒరిజినల్ క్యారెక్టర్‌కి దగ్గరగానే ఉంటుంది. మా నాన్న శంకర్ ఇండియాలో బిగ్గెస్ట్ డైరెక్టర్. నేను ఒక హీరోయిన్‌గా నిరూపించుకోవడానికి ఇదొక పెద్ద ఛాలెంజ్. నాన్న ఇమేజ్‌ని ఒక గౌరవంగానే భావిస్తాను.
ఇది మల్టీ స్టార్ సినిమా. దీనికి శ్రీ చరణ్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. నాకు డ్యాన్స్ చాలా ఇష్టం. ఇందులో రెండు డాన్సింగ్ నెంబర్స్ ఉన్నాయి. ఆ రెండు కూడా నాకు వెరీ ఫేవరెట్. డైరెక్టర్ విజరు కనకమేడల చాలా మంచి క్లారిటీ ఉన్న డైరెక్టర్. సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు.
బోల్డ్ బట్ బ్యూటీఫుల్
- Advertisement -
- Advertisement -