Monday, August 4, 2025
E-PAPER
Homeజాతీయంయూపీలో కాలువలో బోల్తాపడిన బొలెరో

యూపీలో కాలువలో బోల్తాపడిన బొలెరో

- Advertisement -

– 11 మంది మృతి
– ఆలయానికి యాత్రికులను తీసుకెళ్తుండగా ఘటన
గోండా :
ఉత్తరప్రదేశ్‌లోని గోండాలో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. పృథ్వీనాథ్‌ ఆలయానికి యాత్రికులను తీసుకెళుతున్న బొలెరో వాహనం అదుపుతప్పి కాలువలో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందారు. పరాసరారు-ఆలవాల్‌ డియోర మార్గంలోని రేహారి గ్రామం సరయూ కాలువ వంతెన వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో 15 మంది యాత్రికులు ఉన్నారు. వారిలో నలుగురిని స్థానికులు కాపాడినట్టు పోలీసులు తెలిపారు. సరయూ నది నుంచి మృతదేహాలను బయటకు తీసినట్టు వెల్లడించారు. వాహనంలోని వారంతా మోతీగంజ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని సిహాగావ్‌ వాసులుగా అధికారులు గుర్తించారు. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకొని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ సంతాపం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -