- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: దేశ రాజధాని ఢిల్లీలో సంభవించిన పేలుడు ఘటనలో మరణించిన వారి సంఖ్య 13కి చేరింగి. దీనిపై తాజాగా స్పందించిన ప్రధాని నరేంద్రమోడీ.. నిందితులెవరైనా సరే వదిలిపెట్టబోమన్నారు. తాజాగా ఈ కేసు దర్యాప్తును నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అప్పగిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఎన్‌ఐఏ టీమ్ ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి త్వరలోనే పూర్తి నివేదిక ఇవ్వనుంది. ఇప్పటికే సీసీటీవీ ఫుటేజ్‌లో గుర్తించిన ముగ్గురు అనుమానితుల్ని పుల్వామాలో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వీరిలో లక్నోకు చెందిన మహిళా డాక్టర్ షహీన్ షాహిద్ కూడా ఉంది. సెక్టార్ 56లోని అద్దె ఇంటిలో భారీగా పేలుడు పదార్థాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
- Advertisement -



