Thursday, May 8, 2025
Homeజాతీయంవిమానాన్ని పేల్చేస్తాం..ఎయిర్‌పోర్ట్‌కు బెదిరింపు కాల్‌

విమానాన్ని పేల్చేస్తాం..ఎయిర్‌పోర్ట్‌కు బెదిరింపు కాల్‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ప‌హ‌ల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావ‌రాలే ల‌క్ష్యంగా భార‌త సైన్యం మంగ‌ళ‌వారం అర్ధరాత్రి తర్వాత మెరుపు దాడుల‌కు పాల్పడిన సంగ‌తి తెలిసిందే. ఆపరేషన్‌ సిందూర్‌ పేరుతో పాక్‌లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా విరుచుకుపడింది. ఈ దాడుల నేపథ్యంలో మహారాష్ట్రలోని ముంబై ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు కాల్‌ రావడం కలకలం రేపుతోంది.
చండీగఢ్‌ నుంచి ముంబైకి వస్తున్న ఇండిగో విమానంలో బాంబు ఉన్నట్లు ఎయిర్‌పోర్ట్‌కు ఉదయం ఫోన్‌ కాల్‌ వచ్చింది. ఆ విమానాన్ని పేల్చేస్తామంటూ బెదిరించారు. అయితే, విమానం ముంబై ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండ్‌ అయ్యింది. భద్రతా బలగాలు వెంటనే విమానాన్ని ఖాళీ చేయించి.. తనిఖీలు నిర్వహించారు. అయితే, అందులో ఎలాంటి పేలుడు పదార్థాలూ, అనుమానాస్పద వస్తువులూ లభ్యం కాలేదు. దీనిపై అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాక్‌పై ప్రతీకార దాడుల వేళ బెదిరింపులు రావడం ఆందోళన కలిగిస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -