- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : బేగంపేటలోని వాతావరణ కార్యాలయానికి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. శుక్రవారం మధ్యాహ్నం లోపు 14 బాంబులు పేలుతాయని గుర్తుతెలియని వ్యక్తులు మెయిల్ పంపారు. ఈ నేపథ్యంలో బాంబు స్క్వాడ్ భవనంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టింది. ప్రధాన బ్లాక్‌లో తనిఖీలు నిర్వహించిన తర్వాత, బాంబు స్క్వాడ్ ఆ ప్రాంతం సురక్షితమని ధృవీకరించింది.
- Advertisement -



