- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఒడిశాలోని పూరి జగన్నాథ్ ఆలయాన్ని పేల్చివేస్తామని మంగళవారం సోషల్ మీడియాలో ఓ పోస్టు వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో ఇవాళ భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆన్‌లైన్ పోస్టు ఆధారంగా ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం ఫేస్‌బుక్‌లో ఆ పోస్టు కనిపించింది. ఆలయాన్ని పేల్చడంతో పాటు బీజేడీ రాజ్యసభ ఎంపీ సుభాషిస్ కుంతియాను అటాక్ చేస్తామని కూడా ఆ పోస్టులో హెచ్చరించారు. షాపింగ్ కాంప్లెక్స్‌ను కూడా పేల్చివేస్తామన్నారు.
- Advertisement -



