- Advertisement -
చండీగఢ్ : పంజాబ్ మినీ సెక్రెటేరియట్, ఛండీగఢ్ జిల్లా కోర్టు, సెక్టార్ 1 సివిల్ సెక్రెటేరియట్‌కు ఇమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో పోలీసులు కోర్టు ప్రదేశాల్లో తనిఖీలు చేపట్టారు. అలాగే కోర్టు లోపలికి వెళ్లే గేట్లన్నీ పోలీసులు తాత్కాలికంగా మూసివేశారు. అరుతే పోలీసులు తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. భద్రతా తనిఖీలు పూర్తయ్యాక కోర్టు కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు సర్కిల్ ఆఫీసర్ (సీఓ) రవికాంత్ సెమ్వాల్ వెల్లడించారు. సైబర్ టీమ్ బాంబు బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి ఇమెయిల్‌ని ట్రేస్ చేసే పనిలో ఉన్నారు అని ఆయన అన్నారు.
- Advertisement -



