Tuesday, April 29, 2025
Navatelangana
Homeజాతీయంపినరయి నివాసం, కార్యాలయానికి బాంబు బెదిరింపులు

పినరయి నివాసం, కార్యాలయానికి బాంబు బెదిరింపులు

- Advertisement -

రాజ్‌భవన్‌ సహా కేరళలోని కీలక ప్రదేశాలకు కూడా…
తిరువనంతపురం :
కేరళ రాజ్‌ భవన్‌కు, ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ అధికార నివాసానికి, పలు ప్రభుత్వ కార్యాల యాలకు, కొచ్చిలోని నెడుంబస్సెరీ అంతర్జాతీయ విమా నాశ్రయానికి సోమవారం బాంబు బెదిరింపులు వచ్చాయి. అయితే వాటన్నింటినీ ఉత్తుత్తి బెదిరింపులేనని పోలీసులు నిర్ధారించారు. రాజ్‌భవన్‌లో, ముఖ్యమంత్రి నివాసమైన క్లిఫ్‌ భవన్‌లో, విమానాశ్రయంలో బాంబులు అమర్చినట్లు ఈ-మెయిల్స్‌ వచ్చాయి. ముఖ్యమంత్రి కార్యాలయం, రాష్ట్ర రవాణా కమిషనర్‌ కార్యాలయానికి కూడా ఈ-మెయిల్స్‌ ద్వారా బెదిరింపులు వచ్చాయి. దీంతో పోలీసులు రాష్ట్ర సచివాలయం సహా అన్ని ప్రదేశాలలో తనిఖీలు నిర్వహించి అనుమానాస్పద వస్తువులేవీ లేవని తేల్చారు. ఎయిర్‌పోర్టులో ఆర్డీఎక్స్‌ పేలుడు పదార్థాలను అమర్చినట్లు తమకు సమాచారం అందించారని నెడుంబస్సెరీ విమానాశ్రయ అధికారులు తెలిపారు. రాష్ట్ర పోలీసులతో పాటు సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది కూడా విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది విమానాశ్రయ టెర్మినల్స్‌లో విధ్వంస నిరోధక చర్యలు చేపట్టగా రాష్ట్ర పోలీసులు పరిసర ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకున్నారు. దక్షిణాది ప్రాంతాలకు వెళ్లే విమానాలకు ఎయిర్‌లైన్స్‌ భద్రతను పెంచింది. తిరువనం తపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి కూడా ఆదివారం ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. ఇటీవలి కాలంలో రాష్ట్రంలోని పలు కీలక సంస్థలను ఇలాంటి తప్పుడు బెదిరింపులతో దుండగులు లక్ష్యంగా చేసుకున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img

తాజా వార్తలు