నవతెలంగాణ-ఆర్మూర్
మున్సిపల్ పరిధిలోని పెర్కిట్లోని కాంతి హైస్కూల్లో బోనాల సంబరాలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో విద్యార్థిని, విద్యార్థులు సాంప్రదాయ వస్త్రాలు, కొందరు విద్యార్థులు పోతరాజు వేషధారణ ధరించి బోనాల సంబరాల్లో పాల్గొన్నారు. చక్కగా బోనాలను అలంకరించుకొని అమ్మవారికి బోనాలను , నైవేద్యాలను సమర్పించారు. తర్వాత విద్యార్థిని విద్యార్థులు వివిధ నృత్యాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు.
ఈ సందర్బంగా కాంతి హైస్కూల్ వ్యవస్థాపకులు ప్రిన్సిపల్ శ్రీ కాంతి గంగారెడ్డి మాట్లాడుతూ.. మా పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులు తమ సాంస్కృతి సాంప్రదాయాలను ఆచరిస్తూ ప్రతి సంవత్సరం ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. డైరెక్టర్ శశాంక్ రెడ్డి మాట్లాడుతూ.. చదువులు, ఆటలు, పాటలతో పాటు సంస్కృతి సాంప్రదాయాల విలువలను విద్యార్థి దశ నుండే నేర్చుకోవడం, తెలుసుకోవడం ద్వారా పరిపూర్ణమైనటువంటి అభివృద్ధి చేకూరుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో విద్యార్థిని, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు పాల్గొని సంబరాలను విజయవంతం చేశారు.
కాంతి హై స్కూల్ లో బోనాల సంబరాలు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES