నవతెలంగాణ -సుల్తాన్ బజార్
అమెరికా వ్యాప్తంగా తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టీటీఏ) ఆధ్వర్యంలో ఆషాఢమాసం సందర్భంగా బోనాల జాతర కార్యక్రమం ఎంతో వైభవోపేతంగా జరిగాయి. ఈ సాంస్కృతిక మహోత్సవాలకు టీటీఏ వ్యవస్థాపకులు డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి, టీటీఏ ఛైర్మన్ డాక్టర్ విజయపాల్రెడ్డి, రెసిడెంట్ నవీన్రెడ్డి మల్లిపెద్ది బృందం సమన్వయంతో ఈ ఉత్సవాలు నిర్వహించారు.
ఈ ఉత్సవాల్లో న్యూయార్క్, ఇండియానా పోలీస్, షార్లెట్, న్యూజెర్సీ, అట్లాంటా, సియాటిల్, డల్లాస్ తదితర రాష్ట్రాలలో ఈ బోనాల ఉత్సవాలు తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాన్ని ప్రతిబింభించేలా అద్భుతంగా జరిగాయి. ఈ సందర్భంగా డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి, అధ్యక్షులు నవీన్రెడ్డి మల్లిపెద్దలు మాట్లాడుతూ.. అమెరికాలోని ప్రతి రాష్ట్రంలో బోనాలు, అలైబలై జాతర కార్యక్రమాలను ఘనంగా నిర్వహించిన రాష్ట్ర టీటీఏ నాయకత్వాన్ని వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో టీటీఏ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్, బోనాల పండుగ అడ్వైజర్ కవితారెడ్డి, జనరల్ సెక్రెటరి శివారెడ్డి కోళ్ల, నర్సింహా పెరుక, వెబ్కమిటీ ఛైర్మన్ నరేంద్రరెడ్డి, మీడియా డైరెక్టర్ దీపికారెడ్డి నల్లలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అమెరికాలోని ప్రతి తెలంగాణ వాసి, తెలుగువారంతా గర్వించేలా ఈ కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు.