Wednesday, September 24, 2025
E-PAPER
Homeజిల్లాలుజిల్లా ఆదర్శ రైతుగా బోనగిరి భాస్కర్

జిల్లా ఆదర్శ రైతుగా బోనగిరి భాస్కర్

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలోని ఉప్లూర్ గ్రామానికి చెందిన రైతు బోనాగిరి భాస్కర్ జిల్లా ఆదర్శ రైతుగా అవార్డు అందుకున్నారు. బుధవారం బోధన్ మండల కేంద్రంలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో కమ్మ ఫంక్షన్ హల్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఐపీఐడి, ఎల్ సిఓఐ చైర్మన్ ఘట్టమనేని బాబురావు, డిస్ట్రిక్ గవర్నర్ అమర్ నాథ్ రావు చేతుల మీదుగా బోనాగిరి భాస్కర్ జిల్లా ఆదర్శ రైతుగా అవార్డును స్వీకరించారు. జిల్లా ఆదర్శ రైతుగా అవార్డు పొందిన బోనాగిరి భాస్కర్ ను  శాలువాతో సత్కరించి, జ్ఞాపిక ప్రశంస పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ అధునాతన పద్ధతులు ఉపయోగించి అధిక దిగుబడులు సాధిస్తున్న రైతులను గుర్తించి వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో జిల్లా స్థాయిలో ఉత్తమ ఆదర్శ రైతులకు అవార్డ్ లు బహుకరించడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో  లయన్స్ క్లబ్ ముఖ్య నాయకులు భశ్వేశవార రావు, శివ నారాయణ, కమ్మర్ పల్లి లయన్స్ క్లబ్ సభ్యులు సుంకరి విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -