Saturday, July 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కృష్ణవేణి హైస్కూల్‌లో బోనాల ఉత్సవాలు

కృష్ణవేణి హైస్కూల్‌లో బోనాల ఉత్సవాలు

- Advertisement -

నవతెలంగాణ-ఆర్మూర్ 
పట్టణంలోని కృష్ణవేణి హై స్కూల్‌లో శుక్రవారం బోనాలు ఉత్సాహభరితంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. విద్యార్థులంతా సంప్రదాయ వస్త్రధారణలో పాల్గొని పండుగకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా పిల్లలు రంగురంగుల ర్యాలీలో బోనం ఎత్తుకొని ఆలయం వరకు ఊరేగింపుగా వెళ్లి భక్తితో పూజలు నిర్వహించారు.  పండుగ సంబరాల్లో భాగంగా అందమైన నృత్య ప్రదర్శనలు కూడా నిర్వహించారు.

 ప్రిన్సిపాల్  టీచర్లు కూడా ఎంతో ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొని విద్యార్థులకు ఉత్తేజాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా పాఠశాల యజమాన్యం మాట్లాడుతూ.. కృష్ణవేణి హై స్కూల్‌లో మేము విద్యతో పాటు సంస్కృతి, సంప్రదాయాలను కూడా విద్యార్థులకు నేర్పిస్తున్నాం. బోనాలు జరుపుకోవడం ద్వారా వారు తమ మాతృసంస్కృతిని అర్థం చేసుకొని భక్తి, ఐక్యత , గౌరవం వంటి విలువలను తీసుకున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -