Saturday, July 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బ్రిలియంట్ లో ఘనంగా బోనాల పండుగ

బ్రిలియంట్ లో ఘనంగా బోనాల పండుగ

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండలంలోని ఖండేబల్లూరు గ్రామంలో స్థాపించిన బ్రిలియంట్ పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి బోనమెత్తారు. శనివారం పాఠశాలలో ఏర్పాటుచేసిన బోనాల పండుగ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొని సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించారు. ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటూ విద్యార్థులు బోనాలు ఎత్తుకొని పోతరాజు వేషంలో అమ్మవారికి బోనాలను అర్పించి నైవేద్యాలు పెట్టారు. రైతులు వర్షం లేక ఇబ్బందులు పడుతున్నారని గ్రామాలలో ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని మొక్కులు తీర్చుకొని నైవేద్యాలు సమర్పించామని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సురేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం సురేష్,  ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని విద్యార్థులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -