నవతెలంగాణ – భువనగిరి
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ముదిరాజుల ఆధ్వర్యంలో శనివారం పెద్దమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ముదిరాజులంతా ఉదయం 7 గంటల నుండి రాత్రి వరకు అమ్మవారికి బోనాలు సమర్పించారు. హనుమాన్ వాడ, ముదిరాజ్ వాడ, ఆర్.బి నగర్, మాటూరి బస్తి, గాంధీ నగర్, జంఖానగూడ, చావుస్ గల్లి, తాతానగర్, శ్రీరామ్ నగర్, విద్యానగర్ లో ఉన్న భక్తులు డప్పు వాయిద్యాలతో బాణాసంచా కాలుస్తూ శివసత్తుల నృత్యాలతో బోనాలను తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించారు. మున్సిపల్ శాఖ పారిశుద్ధ్య పనులు విద్యుత్తు సదుపాయం కల్పించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి వైస్ చైర్మన్ బండ ప్రకాష్ భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి కిసాన్ నగర్ లోని పెద్దమ్మ తల్లి దేవాలయం వద్ద బోనాల ఉత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా బోనాల ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో బండ ప్రకాష్ పైళ్ల శేఖర్ రెడ్డిలను ఉత్సవ కమిటీ సభ్యులు కొలుపుల వివేకానంద, తుపాకుల శ్రీనివాస్, గుర్రాల శివ గణేష్ ఘనంగా సన్మానించారు. అనంతరం ఎల్బీనగర్ లోని పెద్దమ్మ దేవాలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థల జిల్లా మాజీ చైర్మన్ డాక్టర్ జడల అమరేందర్ గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్లు పెంట నరసింహ, ఎనబోయిన ఆంజనేయులు నాయకులు ఇట్టబోయిన గోపాల్, సాధు విజయకుమార్, కొలుపుల హరినాథ్ నీలా శ్రీనివాస్, మేడబోయిన రాము, బిఆర్ఎస్ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ఏవి కిరణ్ కుమార్, రచ్చ శ్రీను, పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కుంభం ప్రత్యేక పూజలు
పట్టణంలో ఎల్బీనగర్ లో, కిసాన్ నగర్ లో పెద్దమ్మతల్లి దేవాలయాల వద్ద నిర్వహించిన బోనాల ఉత్సవంలో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పెద్దమ్మ తల్లి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయం చైర్మన్ అవైస్ చిస్తీ మున్సిపల్ మాజీ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, కూర వెంకటేష్, ఎనబోయిన జహంగీర్ పాల్గొన్నారు.