Tuesday, February 17, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరైతులకు బోనస్‌ నిధులు విడుదల

రైతులకు బోనస్‌ నిధులు విడుదల

- Advertisement -

2.17లక్షల మందికి ప్రయోజనం :మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

తెలంగాణ రైతులకు ప్రబుత్వం తీపి కబురు చెప్పింది. వరి బోనస్‌ బకాయిలకు సంబంధించి నిధులను విడుదల చేసింది. వరి రైతులకు సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ కోసం రూ.514.36 కోట్లు విడుదల చేస్తున్నట్టుప్రకటించింది. ఈ బోనస్‌ పంపిణీ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 2025-26 ఖరీఫ్‌ సీజన్‌లో వరి సాగు చేసిన 2.17లక్షల మంది రైతులకు ప్రయోజనం కలగనుంది. ఈ నిధుల విడుదలతోపాటు పౌరసరఫరాల సంస్థ వరి బోనస్‌ కోసం రూ.1,939.58 కోట్లు విడుదల చేయనుంది. వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా మార్చడం, సాగును ప్రోత్సహించడానికి ప్రభుత్వం వరి క్వింటాల్‌పై రూ.500 బోనస్‌ ఇస్తున్న విషయం తెలిసిందే. కనీస మద్దతు ధర కంటే ఈ రూ.500అదనమనీ, ఈ బకాయిలు చెల్లింపుతో రైతులకు గణనీయమైన ఆర్థిక ఉపశమనం కలుగుతుందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -