నవతెలంగాణ-హైదరాబాద్
సమాచార, పౌరసంబంధాల శాఖ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్‌లోని మాసాబ్ ట్యాంక్‌లో ఉన్న సమాచార్ భవన్‌లో ఈ ఉత్సవా లను ఉద్యోగులు, సిబ్బంది సంయుక్తంగా చేపట్టా రు. సమాచార శాఖ ఉద్యోగుల కల్చరల్ అసోసి యేషన్ ఆధ్వర్యంలో ఊరేగింపు, బోనాల సమర్పణ తదితర కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు సైతం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ సిహెచ్ ప్రియాంక సమాచార్ భవన్ ప్రాంగణంలో ఉన్న కనకదుర్గ గుడిని సందర్శించి పూజలు చేశారు. అనంతరం జరిగిన ప్రదర్శనలో కళాకా రులు డప్పు విన్యాసాలు, పోతరాజుల ప్రదర్శనతో పాటు పలు కళారూపాలు ప్రదర్శించారు. ఈ ఉత్సవాల్లో సమాచార శాఖ డైరెక్టర్ ఎల్‌ఎల్ ఆర్ కిషోర్‌బాబు, అదనపు డైరెక్టర్ డిఎస్ జగన్, జేడీలు డిశ్రీనివాస్, కె.వెంకటరమణ, మాజీ డైరెక్టర్ సుభాష్‌గౌడ్, సీఐఈ రాధాకిషన్, డిప్యూటీ డైరెక్టర్లు ఎం. మధుసూధన్, సి రాజారెడ్డి, జి ప్రసాద్‌రావు, కెవి సురేష్, ఆర్‌ఐఈ జయరామ్మూర్తి, సహాయ సంచాలకులు ప్రణీత్‌కుమార్, సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సమాచార్ భవన్‌లో బోనాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES