Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలునేడు గాంధీభవన్‌లో..''విధ్వంసం నుంచి వికాసం వైపు'' పుస్తకావిష్కరణ

నేడు గాంధీభవన్‌లో..”విధ్వంసం నుంచి వికాసం వైపు” పుస్తకావిష్కరణ

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ రాసిన వ్యాసాల సంకలనం ”విధ్వంసం నుంచి వికాసం వైపు” అనే పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో నిర్వహించనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర ప్రజా పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా, గత పదేళ్ల బీఆర్‌ఎస్‌ విధ్వంస పాలనను విశ్లేషిస్తూ ఆయన వివిధ పత్రికల్లో ఈ వ్యాసాలను రాశారు. టీపీసీసీ నూతన మొదటి ఎగ్జిక్యూటివ్‌ సమావేశంలో ఏఐసీసీ ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌, సీఎం రేవంత్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొననున్నారు. 260 పేజీలు కలిగిన ఈ పుస్తకంలో ఇందిరమ్మ రాజ్యం లక్ష్యంగా సీఎం రేవంత్‌ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేసేందుకు ఈ వ్యాసాలు ఉపయోగపడేందుకు వ్యాసాలు రాసినట్టు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ తెలిపారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో విధ్వంసం పాలైన రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణ రైజింగ్‌ నినాదంతో వికాసం దిశగా తీసుకెళ్తున్న ప్రగతిని ఈ వ్యాసాలు ప్రతిబింబిస్తాయని ఆయన చెప్పారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad