అంతర్జాతీయ కుమార్తెల దినోత్సవం పురస్కరించుకొని జాలాది రత్న సుధీర్ రచించిన ‘కుమార్తెకు … ప్రేమతో నాన్న’ పుస్తకావిష్కరణ సభ ఈ నెల 27 సాయంత్రం రవీంద్ర భారతి కాన్ఫరెన్స్ హాల్‌లో జరుగుతుంది. ఈ సభలో తెలంగాణ భాషా సాంస్కతిక శాఖ సంచాలకులు డా. ఏనుగు నరసింహారెడ్డి, సి.ఎస్. రాంబాబు, దినకర్ బాబు ఐ.ఏ.ఎస్ (రి), రచయిత్రి పల్లవి, కవయిత్రి దేవనపల్లి వీణా వాణి మొదలయిన వారు పాల్గొంటారు.
పాలపిట్ట బుక్స్
28న నల్ల పద్యం పరిచయ సభ
కవి పిన్నంశెట్టి కిషన్ రాసిన నల్ల పద్యం కవితా సంపుటి పుస్తక పరిచయ సభ ఈ నెల 28న ఉదయం 10 గంటలకు కరీంనగర్ ఫిలింభవన్‌లో తెలంగాణ రచయితల వేదిక కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జరుగనున్నది. సభకు సి.వి. కుమార్ అధ్యక్షత వహిస్తారు. వక్తలుగా అన్నవరం దేవేందర్, పి.ఎస్. రవీంద్ర, డాక్టర్ రఘురామన్, పుప్పాల శ్రీరామ్ హాజరవుతారు.
– దామరకుంట శంకరయ్య, ప్రధాన కార్యదర్శి, తెరవే కరీంనగర్
డా. చిటికెన కిరణ్ కుమార్‌కి వడ్డేపల్లి కృష్ణ సాహిత్య పురస్కారం
తెలుగు సాహిత్యానికి విశిష్ట సేవలు అందిస్తూ కవిగా, రచయితగా, విమర్శకుడిగా ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన సిరిసిల్ల వాస్తవ్యులైన డా. చిటికెన కిరణ్ కుమార్ గారిని డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ జాతీయ సాహిత్య పురస్కారం తొలి గ్రహీతగా అఖిల భారత పద్మశాలి సంక్షేమ సంఘం ఎంపిక చేసింది.
27న పుస్తకావిష్కరణ సభ
- Advertisement -
- Advertisement -