నవతెలంగాణ – తొగుట
రైతులు తమ స్మార్ట్ ఫోన్ లో యూరియా బుకింగ్ చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి మోహన్ అన్నారు. శుక్రవారం పెద్ద మసాన్ పల్లి రైతువేదికలో రైతులకు వారి స్మార్ట్ ఫోన్ లో యూరియా బుకింగ్ ఆప్ పై అవగాహనా కల్పించారు. ఈ అవగాహనా కార్యక్రమంలో మండల వ్యవసాయ అధి కారి మాట్లాడుతూ.. ఇక నుండి రైతులు తమ యొక్క స్మార్ట్ ఫోన్ లొ యూరియా బుకింగ్ అప్ గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు. తమకు కావలసిన యూరియా ను వారు వేసిన పంట, విస్తీర్ణం ఆధారంగా బుకింగ్ చేసుకొని 24 గంటల లోపు వారు నమోదు చేసుకు న్న డీలర్ షాప్ లొ పొందవచ్చని తెలిపారు. ఈ విధానంలో రైతులు వారికి నచ్చిన డీల ర్ వద్ద జిల్లా లో ఎక్కడ ఐన కొనుగోలు చేయవచ్చని అన్నారు. ఈ విధానంలో యూరియా అమ్మకాలు రేపు అనగా 20 తేదీ నుండి అమలు చేయడం జరుగుతుం దని చెప్పారు. ఈ కార్యక్రమంలో వ్యవసా య అధికారి మోహన్, వ్యవసాయ విస్తరణ అధికారి నాగార్జున్, కాన్గల్ సొసైటీ డైరెక్టర్ నారాయణ రెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు.
స్మార్ట్ ఫోన్ లోనే యూరియాను బుక్ చేసుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



