సాధారణ మనిషి జీవితానికి కిరీటం : బహుమతి గ్రహీత డేవిడ్ సలై
లండన్ : కెనడియన్-హంగరియన్-బ్రిటిష్ రచయిత డేవిడ్ సలై ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్ గెలుపొందారు. తన రచించిన ‘ఫ్లెష్’ నవలకుగానూ ఈ అవార్డు దక్కింది. సుదీర్ఘంగా సాగే ఒక సాధారణ వ్యక్తి కథ ఇది. ఈ నవల ప్రత్యేక ఏంటంటే రచయిత కొన్ని లైన్ల మధ్య ఖాళీ ఉంచాడు. పాఠకుడు ఆ వ్యక్తికి లోతైన భావాలు, సంఘర్షణలు ఊహించాల్సి ఉంటుంది. అయితే ఆ ఖాళీలు వ్యక్తి జీవితంలో ఏం జరిగి ఉంటుందో తెలిసేలా సులభంగానే రచయిత రూపకల్పన చేశారు. 51 ఏండ్ల డేవిడ్ సలై తుదిపోరులో ఐదుగురు పోటీదారులను అధిగమించి బుకర్ ప్రైజ్‌కు ఎంపికయ్యారు. దీంతో అవార్డు గెలుచుకున్న డేవిడ్‌కు రూ.50,000 పౌండ్లు దక్కనున్నాయి.
మొత్తం 153 నవలలు ఈ ప్రైజ్ కోసం పోటీ పడగా ఐరిష్ రచయిత రాడీ డోయల్, సారా జెస్సీకా పార్కర్‌లతో కూడిన న్యాయనిర్ణేతలు డైవిడ్ రాసిన ‘ఫ్లెష్’ను ఎంపిక చేశారు. ఇందుకోసం జడ్జిలు ఐదుగంటలు సమావేశమయ్యారు. అనంతరం ఏకగ్రీవంగా దీన్ని ఎంపిక చేశారు. అవార్డు ప్రకటించిన అనంతరం న్యాయనిర్ణేత రాడీ డోయల్ మాట్లాడుతూ.. జీవించడం, జీవితానికి సంబంధించిన వింత గురించి ‘ఫ్లెష్’ పుస్తకం చెబుతుందని పేర్కొన్నారు.
ఆంగ్లంలో రాసిన నవలలకు ఏటా బుకర్ ప్రైజ్ ప్రకటిస్తారు. 1969 నుంచి దీన్ని ప్రదానం చేస్తున్నారు. కేవలం ఆంగ్లంలో రాసిన నవలలకే ప్రకటిస్తారు. ఇతర భాషల్లో రాసి ఆంగ్లంలోకి అనువాదమైన నవలలకు ఇంటర్నేషనల్ బుకర్ పురస్కారాన్ని ప్రకటిస్తారు. అయితే యూకే, ఐర్లాండ్ దేశాల్లో ఈ నవలలు పబ్లిష్ అయితేనే ఎంపిక చేస్తారు. కన్నడ రచయిత్రి బాను ముస్తాక్ ఈఏడాది ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ గెలుచుకున్నారు. ‘హార్ట్ ల్యాంప్’ అనే చిన్న కథల సంకలనానికి గాను ఆమెను ఇది వరించింది.
‘ఫ్లెష్’ పుస్తకానికి బుకర్‌ప్రైజ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



