- Advertisement -
నవతెలంగాణ – జక్రాన్ పల్లి
జక్రాన్ పల్లి మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో గ్రామ సంఘం పుస్తకాలపై సిబివో ఆడిటర్ మధు శిక్షణ ఇచ్చారు. ప్రతి మహిళా గ్రామ సంఘంలో జరిగే అన్ని ఆర్థికంగా లావాదేవీలు రసీదులు ఇవ్వాలని, పొదుపులు, అంతర్గత అప్పులు సక్రమంగా వసూలు చేయాలని సూచించారు. గ్రామ సంఘంలో నిర్వహించే అన్ని రకాల పుస్తకాల పై శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపిఎం పుప్పాల గంగాధర్, కమ్యూనిటీ కోఆర్డినేటర్లు, మండలంలోని అన్ని గ్రామ సంఘాల వివో ఏలు, అకౌంటెంట్ పాల్గొన్నారు.
- Advertisement -