Thursday, December 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విజ్ఞానాన్ని పెంపొందించేవి పుస్తకాలే

విజ్ఞానాన్ని పెంపొందించేవి పుస్తకాలే

- Advertisement -

వినియోగదారులు ఈ- కేవైసీ చేయించుకోవాలి- మణికంఠ స్వరాజ్
నవతెలంగాణ – దుబ్బాక 

విజ్ఞానాన్ని పెంపొందించే అత్యుత్తమ సాధనాలు పుస్తకాలే అని, విద్యార్థులు ప్రాథమిక స్థాయి నుంచే కష్టపడి చదువుకునే తత్వం అలవర్చుకోవాలని మణికంఠ గ్యాస్ ఏజెన్సీ యజమాని చింత మణికంఠ స్వరాజ్ అన్నారు. తెలంగాణ జన సమితి జిల్లా యువజన విభాగం అధ్యక్షులు కీసర స్వామి విజ్ఞప్తి మేరకు మంగళవారం దుబ్బాక మున్సిపల్ పరిధిలోని మల్లాయిపల్లి వార్డులో ప్రాథమిక పాఠశాలకు మణికంఠ గ్యాస్ ఏజెన్సీ సహకారంతో ఎనిమిది డెస్కు లను బహుకరించడం జరిగింది. అలాగే ఏడాది పాటు న్యూస్ పేపర్ చందాను కట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓటీపీ తోనే గ్యాస్ సిలిండర్ డెలివరీ చేయడం జరుగుతుందని, వినియోగదారులు “గ్యాస్ కనెక్షన్ ఈ – కేవైసీ” ని తమ డెలివరీ బాయ్స్ వద్ద తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా మణికంఠ స్వరాజ్ ను స్కూల్ హెచ్ఎం రాములు ప్రత్యేకంగా అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -