- Advertisement -
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని నర్సాపూర్ లో బోరు మోటర్ ను సర్పంచ్ బుసపురం సంధ్యా రాజశేఖర్ శనివారం ప్రారంభించారు. గ్రామంలోని ఒకటవ వార్డులో గల నరసింహ స్వామి దేవాలయం, గంగపుత్ర సంఘం అవసరాలను తీర్చే నిమిత్తం బోరు వేయించి, మోటర్ ను ఏర్పాటు చేశారు. అట్టి బోరు మోటర్ ను సర్పంచ్ బుసపురం సంధ్య రాజశేఖర్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బోరు మోటర్ లో పెద్ద ఎత్తున నీరు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. గ్రామంలో అవసరం మేరకే నీటిని ఉపయోగించాలని, అనవసరంగా నీటిని వృధా చేయొద్దని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ కట్ట రాజ్ కుమార్, వార్డ్ సభ్యులు, గ్రామ యువకులు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



