Friday, October 31, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇనాయత్ నగర్ లో బోర్ మోటార్ పనులు ప్రారంభం

ఇనాయత్ నగర్ లో బోర్ మోటార్ పనులు ప్రారంభం

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలోని ఇనాయత్ నగర్ గ్రామంలో బోర్ మోటార్, మినీవాటర్ ట్యాంక్ పనులను శుక్రవారం ప్రారంభించారు. గ్రామంలోనీ గ్రామ పంచాయతీ కాలనీలో  గత కొంత కాలంగా ప్రజలు నీటి ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన ఆయన సుమారు రూ.2లక్షల 30వేల నిధులు బోర్ మోటార్, మినీవాటర్ ట్యాంక్ నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయించారు.

అట్టి నిధులతో చేపట్టిన బోరు మోటర్ పనులను ఇనాయత్ నగర్ గ్రామ శాఖ అధ్యక్షుడు కచ్చకాయల భూమేష్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. అడగగానే బోర్ మోటార్, వాటర్ ట్యాంక్ మంజూరు చేసిన ముత్యాల సునీల్ రెడ్డి గ్రామపంచాయతీ కాలనీ వాసులు, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.  కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు  మకిలి అనిల్, కే.రమేష్, మెట్టు భూమేష్, యాట శంకర్, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు కే.రాజన్న, లష్కర్, రామకృష్ణ, మాన్ సింగ్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -