- Advertisement -
నవతెలంగాణ-రామారెడ్డి
మండలంలోని జగదాంబ తాండ గ్రామపంచాయతీ పరిధిలో 4వ వార్డులో త్రాగునీటి సౌకర్యం కోసం ఆదివారం గ్రామపంచాయతీ నిధుల నుండి బోరు పనులను సర్పంచ్ భూక్య లతా బాయ్ నంద, పాలకవర్గ సభ్యులతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ గంగావత్ పూర్ణ రాజు, పాలకవర్గ సభ్యులు రవీందర్, లీలా చందర్, మాజీ సర్పంచ్ గంగావత్ రాజు, మాజీ ఎంపీటీసీ సత్యాలీ చంద్రు నాయక్ తాండవాసులు తదితరులు ఉన్నారు.
- Advertisement -



