- Advertisement -
నవతెలంగాణ – రామారెడ్డి
మండలంలోని రంగంపేట గ్రామంలోని విఠలేశ్వర స్వామి, శివ ఆలయాల భూముల హద్దులను మంగళవారం ఏర్పాటు చేశారు. గ్రామంలోని ఇందిరమైన పరిశీలన కోసం జిల్లా కలెక్టర్ ఆశిష్ సగ్వాన్ వచ్చినప్పుడు, ఆలయ భూముల హద్దులు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు ఆయన దృష్టికి తీసుకెళ్లడంతో, రెవిన్యూ అధికారులు ఆర్ఐ రవికాంత్, సర్వేయర్ తో పాటు రెవిన్యూ సిబ్బంది గ్రామస్తులతో కలిసి హదలను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో కార్యదర్శి ప్రశాంత్, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మహేష్, సభ్యులు సురేందర్ సింగ్, పిట్టల అశోక్, సంజయ్ సింగ్, ఎంకంపల్లి మహేష్, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -