మాయ కృష్ణ.. సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి
నవతెలంగాణ – భువనగిరి
భువనగిరి పట్టణంలో 700 సర్వే నెంబర్లు హద్దురాలను ఏర్పాటు చేయాలని సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ డిమాండ్ చేశారు. శనివారం సర్వే నెంబర్ 700 లో 107 మందికి స్థలాలు పట్టాలు ఇచ్చారని వారికి స్థలం కేటాయించాలని భువనగిరి ఆర్డీవో కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 2005లో పట్టాలు ఇచ్చి నేటి వరకు స్థలం చూపించకపోవడం బాధాకరమన్నారు. జూన్ 6న ఆ స్థలంలో ప్లాట్లు కేటాయించిన వాళ్లంతా వెళ్లి గుడిసెలు వేసుకున్నారని తెలిపారు. ఎమ్మార్వో ఆర్డీవో, సబ్ కలెక్టర్ ఒక నెల రోజులలో హద్దు రాళ్లు పాతి ఆ స్థలం ఎంతుందో చూసి హద్దురాలు వేస్తామని గుడిశవాసులకు తెలిపారని నేటి వరకు ఎలాంటి పనులు చేయలేదన్నారు.
సర్వేలు చేయకుండా అధికారులు కాలయాపన చేస్తున్నారు .మరల గుడిసెలు ఏపిస్తామని సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యవర్గ సభ్యులు వనం రాజు, కల్లూరి నాగమణి, పట్టణ కమిటీ సభ్యుల వల దాస్ అంజయ్య దండుగిరి , ఈర్ల రాహుల్, కొత్త లక్ష్మయ్య, గుడి శవాసుల పోరాట కమిటీ సభ్యులు దొడ్డి శంకర్, సత్తిబాబు, ఇక్కుర్తి కళావతి , అరుణ, భాగ్య, స్రవంతి, ఇందిరా, ఎస్.కె నజీర్ ఎండి గౌసియా హేమలత మధుమతి, పద్మ, సావిత్రి , పాల్గొన్నారు.
సర్వేనెంబర్ 700లో హద్దులు ఏర్పాటు చేయాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES