ఎల్లారెడ్డిగూడలో విషాద ఘటన
నవతెలంగాణ-బంజారాహిల్స్
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ఎల్లారెడ్డిగూడలో తీవ్ర విషాద ఘటన జరిగింది. కీర్తి అపార్ట్‌మెంట్స్‌లో బుధవారం లిఫ్ట్‌లో ఇరుక్కొని ఐదేండ్ల బాలుడు మృతిచెందాడు. అపార్ట్‌మెంట్ ఐదో అంతస్తులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నరుసు నాయుడు-ఐశ్వర్య దంపతులు ఇద్దరు కొడుకులతో కలిసి నివాసముంటున్నారు. వారి చిన్న కుమారుడు హర్షవర్ధన్(5) మధురానగర్ లోని శ్రీనిధి పాఠశాలలో ఎల్‌కేజీ చదివేవాడు. బుధవారం సాయంత్రం పాఠశాల నుంచి తల్లి, సోదరునితోపాటు ఇంటికి వచ్చిన బాలుడు లిఫ్ట్‌లో ఐదో అంతస్తులోకి వెళ్లాడు. తిరిగి కిందికి దిగుతున్న క్రమంలో 4, 5 అంత స్తుల మధ్యలో లిఫ్ట్ ఆగిపోవడంతో అందులో ఇరుక్కుపోయాడు. బాలుని కేకలు విని అపార్ట్‌మెంట్ సిబ్బంది, స్థానికులు వెంటనే అక్కడకు చేరుకుని లిఫ్ట్ నుంచి బయటకు తీశారు. అపస్మారక స్థితిలోకెళ్లిన బాలున్ని బంజారా హిల్స్‌లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలిం చారు. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న మధురానగర్ పోలీసులు ఘటనా స్థలానికెళ్లి పరిశీలించారు. కేసు దర్యాప్తులో ఉన్నట్టు సమాచారం.
లిఫ్ట్‌లో ఇరుక్కుని బాలుని మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



