Saturday, September 27, 2025
E-PAPER
Homeక్రైమ్విద్యుత్ షాక్ తో బాలుడు మృతి

విద్యుత్ షాక్ తో బాలుడు మృతి

- Advertisement -

నవతెలంగాణ – మాక్లూర్
మండలంలోని మామిడిపల్లి గ్రామంలో విద్యుత్ షాక్ తో బాలుడు మృతి చెందిన సంఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మమిడిపల్లి గ్రామానికి చెందిన చింతా అభినయ్ (15) విద్యార్థి అనే బాలుడు తన తండ్రి చింతా ప్రవీణ్ రెడ్డితో కలిసి పొలంలో నీరు పట్టడానికి వెళ్లాడు. ఆ సమయంలో నీటి మోటార్ స్టార్టర్ వద్ద కరెంట్ ఆపే ప్రయత్నంలో ప్రమాదవశాత్తూ లైవ్ వైర్లను తాకడంతో విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే అపస్మారక స్థితిలో పడ్డాడు. తండ్రి ప్రవీణ్ రెడ్డి కేకలు వేయగా పొరుగువారైన తారక్ జగదీష్ సహాయం అందించి కర్ర సహాయంతో విద్యుత్ నుండి వేరుచేశారు. అనంతరం బంధువుల సహాయంతో గాయపడిన బాలుడిని నిజామాబాద్‌లోని మనోరమా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించగా, అక్కడి వైద్యులు అతను అప్పటికే మృతిచెందినట్లు ధృవీకరించారు. ఈ సంఘటనపై  పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. తండ్రి ఫిర్యాదులో ఎలాంటి అనుమానాలు లేవని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -