Saturday, September 27, 2025
E-PAPER
HomeజాతీయంHeart attack: తల్లి ఒడిలో కన్నుమూసిన బాలుడు

Heart attack: తల్లి ఒడిలో కన్నుమూసిన బాలుడు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: మహారాష్ట్రలోని కొల్హాపూర్‌‌లో గుండెపోటుతో పదేళ్ల బాలుడు మృతి చెందాడు. వినాయక మండపం వద్ద ఆడుకుంటున్న శ్రావణ్ గవాడే అస్వస్థతకు గురి కాగా.. ఇంటికి వెళ్లి తల్లి ఒడిలో పడుకున్నాడు. అయితే కొద్దిసేపటికే గుండెపోటు రావడంతో తల్లి ఒడిలోనే ప్రాణాలు కోల్పోయాడు. తన కొడుకు కదలడం లేదని గమనించిన తల్లి బిగ్గరగా కేకలు వేసింది. స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో తల్లి రోదనలు మిన్నంటుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -